ట్విట్టర్ అధికారిక ఖాతా కావాలా? అయితే ఇలా చేయండి

ABN , First Publish Date - 2021-05-21T14:47:36+05:30 IST

ట్విట్టర్ అధికారిక ఖాతా కావాలా? అయితే ఇలా చేయండి

ట్విట్టర్ అధికారిక ఖాతా కావాలా? అయితే ఇలా చేయండి

న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత పబ్లిక్ వెరిఫికేషన్‌‌ కార్యక్రమాన్ని ట్విట్టర్ ప్రారంభించింది. వెరిఫికేషన్ ఖాతాల కోసం అప్లికేషన్లు తీసుకోబోతున్నట్లు ట్విట్టర్ గురువారం ప్రకటించింది. సోషల్ మీడియా వేదికల్లో ట్విట్టర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ప్రముఖులు అంతా ట్విట్టర్‌ను ప్రధానంగా వాడుతుంటారు. అధికారిక ప్రకటనలకు కూడా ట్విట్టర్ ప్రధాన వేదిక అవుతోంది. ఈ తరుణంలో ట్విట్టర్ అంటే మామూలు జనాల్లో కూడా వివపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అయితే ట్విట్టర్‌లో అధికారిక ఖాతా సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయింది. 2017 నవంబర్‌లో పబ్లిక్ వెరిఫికేషన్‌ను ట్విట్టర్ నిలిపివేసింది. అనంతరం తొందరలోనే ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామని సంస్థ ట్వీట్ చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల అది ప్రారంభం కాలేదు.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ట్విట్టర్ ఖాతా వెరిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ కొరకు వివిధ కేటగిరీలను ప్రతిపాదించారు. అందులో 1. ప్రభుత్వ 2. కంపెనీలు, బ్రాండ్లు, ఆర్గనైజేషన్లు 3. న్యూస్ ఆర్గనైజేషన్లు, జర్నలిస్టులు 4. ఎంటర్‌టైన్‌మెంట్ 5. స్పోర్స్ మరియు గేమింగ్ 6. యాక్టివిస్ట్‌లు, ఆర్గనైజర్లు, పబ్లిక్‌లో పేరున్న ఇతర వ్యక్తులు వెరిఫైడ్ ఖాతా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.






ఎలా అప్లై చేసుకోవాలి?

ట్విట్టర్ యాప్ ద్వారా కానీ, లేదంటే గూగుల్ బ్రజర్ నుంచి కానీ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి.. ట్విట్టర్ అడిగిన వివరాలు ఇవ్వాలి. ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం వెరిఫైడ్ అనే ఆప్షన్ కింద ‘రెక్వెస్ట్ వెరిఫికేషన్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ట్విట్టర్ అడిగిన వివరాలు జతచేసి రెక్వెస్ట్ పంపితే, ట్విట్టర్‌ ఖాతాకు జత చేసిన ఈమెయిల్ ఖాతాకు ధ్రువీకరణ ఈమెయిల్ వస్తుంది. దీంతో మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. మీరు పంపిన వివరాల్ని తనిఖీ చేసి వెరిఫైడ్ ఖాతాను ట్విట్టర్ విడుదల చేస్తుంది.

Updated Date - 2021-05-21T14:47:36+05:30 IST