బ్యాచ్‌లర్ పార్టీలో కాల్పులు..యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-08T13:19:46+05:30 IST

బ్యాచ్‌లర్ పార్టీలో జరిగిన సెలబ్రిటీ ఫైరింగ్ ఘటనలో ఓ యువకుడు మరణించారు....

బ్యాచ్‌లర్ పార్టీలో కాల్పులు..యువకుడి మృతి

ఘజియాబాద్ : బ్యాచ్‌లర్ పార్టీలో జరిగిన సెలబ్రిటీ ఫైరింగ్ ఘటనలో ఓ యువకుడు మరణించారు.సాహిబాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని లాజ్ పత్ నగర్ కాలనీలో హిమాన్షు శర్మ అలియాస్ చద్దా వివాహం సందర్భంగా తన స్నేహితులకు బ్యాచ్ లర్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో లైసెన్సెడ్ రివాల్వరుతో సెలబ్రిటీ ఫైరింగ్ చేశారు.బాచిలర్స్ పార్టీపై వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఢిల్లీ సంస్థలో అకౌంటెంటుగా పనిచేస్తున్న సూరజ్ రాజ్ కు బుల్లెట్ గాయమైంది. తీవ్ర గాయంతో సూరజ్ రాజ్ మరణించారు. దీంతో కాల్పుల ఘటనలో నిందితులైన చద్దా, అభిషేక్ త్యాగి, హరియోమ్ త్యాగి, విక్కీలపై కేసు నమోదు చేసినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ (రెండవ) జ్ఞానేంద్ర సింగ్ చెప్పారు.నిందితులు చద్దా, హరియోమ్, అభిషేక్‌లను అరెస్టు చేశామని, ఇతరులను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సింగ్ వివరించారు. 

Updated Date - 2021-07-08T13:19:46+05:30 IST