తమ ఉద్యోగులకు టీవీఎస్ మోటార్ తీపికబురు

ABN , First Publish Date - 2021-03-07T00:39:53+05:30 IST

తమ ఉద్యోగులకు టీవీఎస్ మోటార్ తీపికబురు

తమ ఉద్యోగులకు టీవీఎస్ మోటార్ తీపికబురు

న్యూఢిల్లీ: ప్రముఖ మల్టీనేషనల్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ఇండియా తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సుమారు 35,000 మంది ప్రత్యక్ష మరియు పరోక్షంగా సంస్థ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు కోవిడ్-19 టీకా ఖర్చును భరిస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది.


ప్రారంభంలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఇస్తామని పేర్కొంది. ఇంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సెంచర్ వంటి ఇతర సంస్థలు కూడా తమ ఉద్యోగులకు కోవిడ్-19 టీకా ఖర్చులను భరిస్తామని ప్రకటించాయి.

Updated Date - 2021-03-07T00:39:53+05:30 IST