ఉదయనిధి సభల్లో ఒమైక్రాన్‌ వ్యాపించదా?: టీటీవీ దినకరన్‌

ABN , First Publish Date - 2021-12-28T16:50:41+05:30 IST

రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహించే సభల్లో మాత్రమే ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాపించే అవకాశముందని డీఎంకే ప్రభుత్వానికి ఎవరైనా నిపుణులు తెలిపారా? అంటూ టీటీవీ దినకరన్‌ వ్యంగాస్త్రాలు

ఉదయనిధి సభల్లో ఒమైక్రాన్‌ వ్యాపించదా?: టీటీవీ దినకరన్‌

చెన్నై/పెరంబూర్‌: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్వహించే సభల్లో మాత్రమే ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాపించే అవకాశముందని డీఎంకే ప్రభుత్వానికి ఎవరైనా నిపుణులు తెలిపారా? అంటూ టీటీవీ దినకరన్‌ వ్యంగాస్త్రాలు సం ధించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ స్మారక మందిరం వద్ద తాము నివాళులర్పించే సమయంలో ఒమైక్రాన్‌ ప్రబలుతుందని అడ్డుకున్న పోలీసులు ఉదయనిధి కోవైలో భారీ సభ నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వా నికి ప్రజల ఆరోగ్యంలపై ఎలాంటి ఆందోళన లేదని దినకరన్‌ ఆరోపించారు.

Updated Date - 2021-12-28T16:50:41+05:30 IST