2022 TTD క్యాలెండర్ ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-10-23T17:17:43+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురణ విభాగం ముద్రించిన 2022 సంవత్సరపు క్యాలెండర్‌ను బెం గళూరు వయ్యాలికావల్‌లోని టిటిడి దేవస్ధానం ప్రాంగణంలో శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించారు. 12 పేజీలతో ఆకర్షణీయం
బెంగళూరు(Karnataka): తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురణ విభాగం ముద్రించిన 2022 సంవత్సరపు క్యాలెండర్‌ను బెం గళూరు వయ్యాలికావల్‌లోని టిటిడి దేవస్ధానం ప్రాంగణంలో శుక్రవారం లాంఛనంగా ఆవిష్కరించారు. 12 పేజీలతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ ప్రత్యేక క్యాలండర్‌కు తొలుత ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.టిటిడి బోర్డు సభ్యుడు ఎంఎన్.శశిధర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తిరుమల కొండలపై కర్ణాటక భక్తులకు మరిన్ని ఉత్తమ సదుపాయాలను కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. టిటిడి బోర్డులో సభ్యత్వం దొరకడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. టిటిడి ఎఇ ప్రసాద్ బాబు, బెంగళూరు టిటిడి ఇన్చార్జి ఎఇఓ సుబ్రమణ్యం, టిటిడి ధర్మప్రచార పరిషత్‌కు చెందిన భుజంగరావుతో పాటు టిటిడి సిబ్బంది ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. భక్తులకు టిటిడి క్యాలెండర్ల విక్రయం ప్రారంభమైందని ఒక్కో క్యాలండర్ ధర రూ 130గా ఉంటుందని టిటిడి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.