వెస్ట్ బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. మమత రిజల్ట్ ఇలా ఉంటే ఆమె పార్టీ మాత్రం..!

ABN , First Publish Date - 2021-05-02T16:54:30+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీల్లోనూ కాక రేపుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు.

వెస్ట్ బెంగాల్‌లో అనూహ్య పరిణామం.. మమత రిజల్ట్ ఇలా ఉంటే ఆమె పార్టీ మాత్రం..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీల్లోనూ కాక రేపుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. మరీ ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను క్షణక్షణం గమనిస్తూ వస్తున్నారు. మమత గెలుస్తారా..? లేక సువేంధు అధికారి తన పంతాన్ని నెగ్గించుకుంటారా? అన్నది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి సువేంధు అధికారి 8201 ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. మమతా బెనర్జీ మాత్రం వెనకబడి ఉన్నారు. దీంతో అక్కడ తమ పార్టీ గెలుపు ఖాయమని బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరపడిపోతున్నారు. కాగా, నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ వెనకంజలో ఉండగా, ఆమె పార్టీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆధిక్యాల్లో దూసుకెళ్తుండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్లో మొత్తం 292 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 172 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. బీజేపీ మాత్రం 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

Updated Date - 2021-05-02T16:54:30+05:30 IST