రేపటి నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-12-31T16:17:43+05:30 IST

చెన్నై మెట్రోరైలు సేవలు శనివారం (జనవరి 1వ తేదీ) నుంచి మారనున్నాయి. ప్రస్తుతం సాధారణ రోజులు (సోమవారం నుంచి శనివారం) వరకు తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోరైళ్లు నడుపుతున్నారు.

రేపటి నుంచి మెట్రోరైలు వేళల్లో మార్పులు

పెరంబూర్‌(చెన్నై): చెన్నై మెట్రోరైలు సేవలు శనివారం (జనవరి 1వ తేదీ) నుంచి మారనున్నాయి. ప్రస్తుతం సాధారణ రోజులు (సోమవారం నుంచి శనివారం) వరకు తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోరైళ్లు నడుపుతున్నారు. రద్దీ సమయాలైన ఉదయం 8 నుంచి 11 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు 5 నిమిషాలకు ఒక రైలు, మిగిలిన సమయాల్లో 10 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నారు. 2022 జనవరి 1 నుంచి మెట్రోరైలు సేవలు ఆదివారాల్లో యధావిధిగా ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు 10 నిమిషాలకు ఒక రైలు నడుపనున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో సాధారణంగా ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు నడుపుతున్న రైళ్లు, జనవరి 1వ తేదీ నుంచి తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు 10 నిముషాలకు ఒక రైలు నడుపనున్నట్టు సీఎంఆర్‌ఎల్‌ తెలియజేసింది.

Updated Date - 2021-12-31T16:17:43+05:30 IST