నేడు భూమి సమీపంలోకి గ్రహశకలం

ABN , First Publish Date - 2021-08-21T07:54:03+05:30 IST

శనివారం భూమికి అత్యంత సమీపం నుంచి ఓ గ్రహశకలం దూసుకెళ్లనుంది. ‘2016 ఏజే193’

నేడు భూమి సమీపంలోకి గ్రహశకలం

వాషింగ్టన్‌, ఆగస్టు 20: శనివారం భూమికి అత్యంత సమీపం నుంచి ఓ గ్రహశకలం దూసుకెళ్లనుంది. ‘2016 ఏజే193’ పేరుతో పిలిచే ఈ శకలం 1.4 కిలోమీటర్ల వెడల్పుతో ఉందని, గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని నాసా ప్రకటించింది. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 9 రెట్లు దూరంలో ఈ గ్రహశకలం ప్రయాణిస్తుందని నాసా వివరించింది. ప్రమాదకర గ్రహశకలాల జాబితాలో తాజా శకలం కూడా ఉన్నట్లు తెలిపింది. తిరిగి 2063లో భూమికి అత్యంత సమీపానికి వస్తుందని వెల్లడించింది. 

Updated Date - 2021-08-21T07:54:03+05:30 IST