కోల్‌కతా మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం.. కొనసాగుతున్న టీఎంసీ దూకుడు

ABN , First Publish Date - 2021-12-21T21:39:57+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి

కోల్‌కతా మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం.. కొనసాగుతున్న టీఎంసీ దూకుడు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి మరో దారుణ పరాజయం ఎదురైంది. కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరగ్గా ఈ ఉదయం ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ మరోమారు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.


మొత్తం 144 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 124 వార్డుల్లో అధికార టీఎంసీ పూర్తి ఆధిక్యం సాధించి క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయింది. ఐదు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. సీపీఎం, కాంగ్రెస్ చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. టీఎంసీ దాదాపు 74.2 శాతం ఓట్లతో భారీ ఓట్ షేర్ సాధించింది. 

Updated Date - 2021-12-21T21:39:57+05:30 IST