నేనో పెద్ద గాడిదను: మమత

ABN , First Publish Date - 2021-03-22T07:02:53+05:30 IST

సువేందు అధికారి కుటుంబంపై సీఎం మమతా బెనర్జీ ఆదివారం మరోమారు విరుచుకుపడ్డారు.

నేనో పెద్ద గాడిదను: మమత

‘అధికారి’ కపటాన్ని గుర్తించలేకపోయా

బీజేపీ అంటే.. భారతీయ చెడ్డ పార్టీ: మమత


కోల్‌కతా, మార్చి 21: సువేందు అధికారి కుటుంబంపై సీఎం మమతా బెనర్జీ ఆదివారం మరోమారు విరుచుకుపడ్డారు. ‘‘ఇన్నాళ్లూ అధికారి కుటుంబం నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాను. నేనో పెద్ద గాడిదను. ఆ కుటుంబం రూ. 5,000 కోట్లతో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఎన్నికల్లో గెలవడానికి ఆ డబ్బు వెదజల్లుతోంది. అలాంటి వారికి ఓటేయకండి. నేను మళ్లీ అధికారంలోకి వచ్చాక.. ఆ 5 వేల కోట్లపై దర్యాప్తు జరిపిస్తా’’ అని ఆమె వ్యాఖ్యానించారు.


కాంతి దక్షిణ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. అధికారి కుటుంబాన్ని ద్రోహులుగా అభివర్ణించారు. ఈ ప్రాంతాన్ని ఆ కుటుంబం జమిందారీల మాదిరిగా పాలిస్తోందని, ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంలో అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. మధ్యమధ్యలో ఆమె ‘‘వందే మాతరం’’, ‘‘జైహింద్‌’’ అంటూ నినాదాలిచ్చారు. రాష్ట్రం శాంతి సామరస్యాలు, అభివృద్ధి బాటలో పయనించాలంటే బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అంటే.. భారతీయ జొఘొన్నో(చెడ్డ) పార్టీ అని అభివర్ణించారు. 


Updated Date - 2021-03-22T07:02:53+05:30 IST