జాలరి వలలో తిమింగళం

ABN , First Publish Date - 2021-12-30T17:12:44+05:30 IST

పుదుచ్చేరి జాలర్లు సముద్రంలో విసిరిన వలలో 20 అడుగుల పొడవు, 2,500 కిలోల బరువు కలిగిన భారీ తిమింగళం చిక్కింది. తేంగాయ్‌తెట్టు ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి శరవణన్‌ అనే జాలరి నేతృత్వంలో నలుగురు చేపల

జాలరి వలలో తిమింగళం

ప్యారీస్‌(చెన్నై): పుదుచ్చేరి జాలర్లు సముద్రంలో విసిరిన వలలో 20 అడుగుల పొడవు, 2,500 కిలోల బరువు కలిగిన భారీ తిమింగళం చిక్కింది. తేంగాయ్‌తెట్టు ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి శరవణన్‌ అనే జాలరి నేతృత్వంలో నలుగురు చేపల వేటకు సముద్రంలోకి పడవ ద్వారా వెళ్లారు. తేంగాయ్‌తెట్టుకు 25 కి.మీ దూరంలో వారు విసిరిన వల బరువెక్కడంతో అనుమానంతో హార్బర్‌కు తరలించి చూడగా, వలలో భారీ తిమింగళం చిక్కుకున్నట్లు గుర్తించారు. అది అప్పటికే మరణించి ఉంది. దీనిపై అందజేసిన సమాచారంతో స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు బుధవారం ఉదయం తేంగాయ్‌తెట్టు షిఫింగ్‌ హార్బర్‌కు చేరుకొని తిమింగళం కళేబరాన్ని స్వాదీనం చేసుకున్నారు.

Updated Date - 2021-12-30T17:12:44+05:30 IST