ఆ పులి క్రూర జంతువు కాదు...

ABN , First Publish Date - 2021-10-07T15:00:19+05:30 IST

నీలగిరి జిల్లా అటవీ ప్రాంతంలో గాలిస్తున్న ‘టి23’ పులిని క్రూర జంతువుగా భావించలేమని, క్రూర జంతువులైన పులి ప్రధాన ఆహారం మనిషి మాంసం అని, ప్రస్తుతం గాలిస్తున్న పులి అలాంటిది

ఆ పులి క్రూర జంతువు కాదు...

                 - అటవీ శాఖ వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేటర్‌


పెరంబూర్‌(చెన్నై): నీలగిరి జిల్లా అటవీ ప్రాంతంలో గాలిస్తున్న ‘టి23’ పులిని క్రూర జంతువుగా భావించలేమని, క్రూర జంతువులైన పులి ప్రధాన ఆహారం మనిషి మాంసం అని, ప్రస్తుతం గాలిస్తున్న పులి అలాంటిది కాదని రాష్ట్ర  వైల్డ్‌ లైఫ్‌ కన్జర్వేటర్‌ శేఖర్‌కుమార్‌ నీరజ్‌ తెలిపారు. నీలగిరి జిల్లా ముదుమలై అటవీ ప్రాంతం పరిధిలో టి23 పులి గాలింపు చర్యలు 12వ రోజైన బుధవారం కొనసాగాయి. దీనిని స్వయంగా పరిశీలించిన ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శేఖర్‌కుమార్‌ నీరజ్‌ విలేఖరులతో మాట్లాడుతూ.. టి23 పులి మనుషులను హతమార్చిన ప్రాంతాలను శాస్త్రీయ పద్ధతిలో పరిశీలిస్తున్నామన్నారు. ప్రతిరోజు కొత్త వ్యూహాలతో పులి జాడ కనుగొని బం ధించే చర్యలు చేపట్టామని తెలిపారు. టి 23 పులి, గాలింపు చర్య ల్లో పాల్గొంటున్న అటవీ సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. సింగార అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలు గుర్తించిన నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మ రం చేసినట్టు వెల్లడించారు.. ఆ పులి వయస్సు మీరిన కారణంగా వేటాడడంతో శ్రమ పడుతున్నట్లు తెలుస్తోందన్నారు. సింగార ప్రాంతంతోపాటు దాని సమీపంలోని మన్రాడియార్‌ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. పులికి మత్తుమందిచ్చి బంధించేందుకు ఆరు గురు పశువైద్యులతో కూడిన బృందాలు, 50 కెమెరాలు, డ్రోన్‌ కెమెరా, గుంకీ ఏనుగులు, మూడు శునకాలు, 70 మంది నిష్ణాతులైన అటవీ సిబ్బంది శ్రమిస్తున్నారని తెలిపారు. కాగా, ఈ పులి చంపిందంటున్న నాలుగు మరణాల్లో రెండు మరణాలు ఈ పులి వల్లే జరిగాయని నిర్ధారించలేకున్నామని, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ విషయం తెలుస్తుందన్నారు. పులిని బోనులో బంధిస్తే అది మానసికంగా ఇబ్బంది పడుతుందని, దానిని సరిచేసేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పులులకు రేడియో కాలర్‌ ద్వారా పర్యవేక్షించనున్నామని తెలిపారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి రేడియో కాలర్‌ తెప్పించామన్నారు. సాధారణంగా అడవుల్లో సంచరించే పులులు 14 ఏళ్లు జీవిస్తాయని, కానీ, జూపార్క్‌లో ఉంచి పరిరక్షించడం ద్వారా మరో 10 ఏళ్లు అదనంగా జీవిస్తాయని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-07T15:00:19+05:30 IST