శ్రీనగర్ శివార్లలో encounter ...ముగ్గురు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2021-12-31T14:31:01+05:30 IST

జమ్మూకశ్మీరులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు....

శ్రీనగర్ శివార్లలో encounter ...ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీరులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ శివార్లలో జరిగిన జైషే మహ్మద్ ఉగ్రవాది సహా ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ నెల ప్రారంభంలో పోలీసు బస్సుపై దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాది ఈ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పాంథాచౌక్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారని కశ్మీర్ పోలీసులు తెలిపారు.హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు సుహైల్ అహ్మద్ రాథర్‌గా గుర్తించారు.


 ఇతను శ్రీనగర్ శివార్లలోని జెవాన్ వద్ద పోలీసు క్యాంపు సమీపంలో పోలీసు బస్సుపై దాడికి పాల్పడ్డాడడని పోలీసులు చెప్పారు.జమ్మూ కశ్మీర్ సాయుధ పోలీసు సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై ఈ నెల ప్రారంభంలో జరిగిన ఘోరమైన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ అంతమొందించినట్లు పోలీసులు వివరించారు.అంతకుముందు జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గామ్ జిల్లాల్లో భద్రతా దళాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయులతో సహా ఆరుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు.


Updated Date - 2021-12-31T14:31:01+05:30 IST