మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు రెజ్లర్ల దుర్మరణం

ABN , First Publish Date - 2021-02-01T10:05:52+05:30 IST

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు....

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు రెజ్లర్ల దుర్మరణం

సతారా (మహారాష్ట్ర): మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పూణే-బెంగళూరు జాతీయ రహదారిపై కరద్ ప్రాంతంలో వేగంగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు రెజ్లర్లు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొల్హాపూర్ పట్టణంలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని కారులో తిరిగి పూణేకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మణించిన రెజ్లర్లు పూణే నగరంలోని కట్రాజ్ ప్రాంత వాసులని పోలీసులు చెప్పారు. మరో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-02-01T10:05:52+05:30 IST