మూడడుగుల మీనాక్షి అమ్మవారి విగ్రహం లభ్యం

ABN , First Publish Date - 2021-10-31T14:32:11+05:30 IST

మదురై చోళవందాన్‌ సమీపంలోని వైగై నదిలో లభ్యమైన 3 అడుగుల మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువేంగడం ప్రాంతంలోని నది తీరానికి శనివారం ఉదయం వెళ్లిన కొం

మూడడుగుల మీనాక్షి అమ్మవారి విగ్రహం లభ్యం

పెరంబూర్‌(Chennai): మదురై చోళవందాన్‌ సమీపంలోని వైగై నదిలో లభ్యమైన 3 అడుగుల మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువేంగడం ప్రాంతంలోని నది తీరానికి శనివారం ఉదయం వెళ్లిన కొందరు నదిలో పచ్చరంగు దుస్తులు కనిపించడం చూశారు. వారిలో కొందరు ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా, 3 అడుగుల ఎత్తుతో పచ్చరంగు పట్టుచీరతో అలంకరించిన మీనాక్షి అమ్మవారి విగ్రహాన్ని గుర్తించి వెలుపలికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న వాడిప్పాడి తహసీల్దార్‌ నవనీతకృష్ణన్‌ గ్రామానికి చేరుకొని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-10-31T14:32:11+05:30 IST