ఆకర్షిస్టున్న మూడడుగుల ఆవు

ABN , First Publish Date - 2021-07-24T14:17:38+05:30 IST

ధర్మపురి జిల్లా అరూర్‌ సమీపంలోని పాపిశెట్టి పాళయం గ్రామంలో మూడడుగుల ఎత్తున్న ఆవును స్థానికులు ఆసక్తిగా చూసి వెళుతున్నారు. పాపిశెట్టిపాళయం గ్రామానికి చెందిన కు

ఆకర్షిస్టున్న మూడడుగుల ఆవు

ప్యారీస్‌(చెన్నై): ధర్మపురి జిల్లా అరూర్‌ సమీపంలోని పాపిశెట్టి పాళయం గ్రామంలో మూడడుగుల ఎత్తున్న ఆవును స్థానికులు ఆసక్తిగా చూసి వెళుతున్నారు. పాపిశెట్టిపాళయం గ్రామానికి చెందిన కుప్పుస్వామి, వడివిదం దంపతులు పాడి పశువులు పెంచి పోషిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఓ పాడి ఆవు ఓ లేగదూడకు జన్మనిచ్చింది. ఏళ్లు గడుస్తున్నా అది మూడడుగులకు మించి పెరగలేదు. ఈ విషయమై కుప్పుస్వామి దంపతులు మీడియాతో మాట్లాడుతూ, తమ ఇంట జన్మించిన వింత పాడి ఆవును అదృష్టంగా భావిస్తున్నామని, కొంతమంది వ్యాపారులు ఈ ఆవు కావాలని రూ. లక్ష వరకు బేరమాడారని, డబ్బుకు ఆశపడి తమ బిడ్డలాంటి పశువును విక్రయించబోమని తేల్చి చెప్పారు.

Updated Date - 2021-07-24T14:17:38+05:30 IST