టీకా మీద టీకా...
ABN , First Publish Date - 2021-07-08T08:56:20+05:30 IST
కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం వచ్చిన ఓ వృద్ధుడికి వైద్యసిబ్బంది ఒకేసారి రెండు డోసులు వేశారు. దీంతో ఆయనకు మొత్తం మూడు డోసులు వేసినట్టయింది.

- సిబ్బంది నిర్లక్ష్యంతో వృద్ధుడికి మూడు డోసులు
చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్ రెండో డోసు కోసం వచ్చిన ఓ వృద్ధుడికి వైద్యసిబ్బంది ఒకేసారి రెండు డోసులు వేశారు. దీంతో ఆయనకు మొత్తం మూడు డోసులు వేసినట్టయింది. తమిళనాడులోని తేని జిల్లా కొట్టైకలం చిన్నమాయం వీధికి చెందిన చంద్రశేఖర్ (67) బొమ్మైగౌండపట్టి గత ఏప్రిల్‌లో కొవీషీల్డ్ టీకా మొదటి డోస్ వేయించుకున్నారు. రెండో డోసు కోసం మంగళవారం తేని తాలూకా కార్యాలయం వద్ద శిబిరానికి వచ్చారు. వైద్యసిబ్బంది రెండో డోస్ వేయగానే పక్కన నిల్చున్నారు. అయితే ఆయన వ్యాక్సిన్ కోసమే వేచివున్నాడని భావించిన సిబ్బంది వివరాలు అడగకుండానే మరోమారు టీకా వేశారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి సమస్యలు లేకపోయినా.. ఇంట్లోనే ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.