టర్కీలో మత బోధకుడికి వెయ్యేళ్ల జైలు

ABN , First Publish Date - 2021-01-13T07:47:58+05:30 IST

ఇస్లామిక్‌ టీవీ మత బోధకుడు, రచయి త అద్నన్‌ ఒక్తర్‌కు టర్కీలోని ఓ కోర్టు వెయ్యేళ్ల జైలుశిక్ష విధించింది.

టర్కీలో మత బోధకుడికి వెయ్యేళ్ల జైలు

 మోసం, లైంగిక వేధింపులకు శిక్ష


అంకారా, జనవరి 12: ఇస్లామిక్‌ టీవీ మత బోధకుడు, రచయి త అద్నన్‌ ఒక్తర్‌కు టర్కీలోని ఓ కోర్టు వెయ్యేళ్ల జైలుశిక్ష విధించింది. మోసం చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, నేరస్థుల బృందాన్ని ఏర్పాటుచేసి నడపడం వంటి చర్యలకు పాల్పడినందుకు అతడికి ఈ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఒక్తర్‌ గతంలో ‘ఏ9’ అనే టీవీ చానెల్‌ను ఏర్పాటు చేసి ఇస్లాంపై కార్యక్రమాలు నిర్వహించేవాడు.


ఒకసారి మహిళలతో కలిసి అతడు నృత్యం చేస్తూ, పురుషులతో పాటలు పాడుతున్న వీడియో ఒకటి ప్రసారమైంది. అతడు ఆ వీడియోలో ఆ మహిళలను పిల్లికూనలు అని, పురుషులను తన సింహాలు అని పేర్కొన్నాడు. దీంతో 2018 జూలైలో ఒక్తర్‌తో పాటు మరో 77 మంది ని ఇస్తాంబుల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో ఒక్తర్‌కు, అతడి 13 మంది సభ్యులకు కలిపి కోర్టు 9,803 సంవత్సరాల ఆరు నెలల జైలుశిక్షను విధించింది. వీరి లో ఒక్తర్‌ ఒక్కడికే వివిధ నేరాలపై 1075 ఏళ్ల మూడు నెలల జైలుశిక్ష విధిస్తూ తీ ర్పు చెప్పింది. ఒక్తర్‌ 300పైగా పుస్తకాలు రాశాడు. 73 పుస్తకాలను అనువదించాడు.


Updated Date - 2021-01-13T07:47:58+05:30 IST