తల నరుకుతామని బెదిరించారు ఎస్‌ఐఐ సీఈఓ పూనావల్లా

ABN , First Publish Date - 2021-05-02T23:49:54+05:30 IST

ఎన్నికలు, కుంభమేళా గురించి మాట్లాడితే తల నరుకుతామంటూ కొందరు ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాల నుంచి తనకు బెదింపులు వచ్చినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావల్లా సంచలన ఆరోపణలు చేశారు.

తల నరుకుతామని బెదిరించారు   ఎస్‌ఐఐ సీఈఓ పూనావల్లా

న్యూఢిల్లీ : ఎన్నికలు, కుంభమేళా గురించి మాట్లాడితే తల నరుకుతామంటూ కొందరు ముఖ్యమంత్రులు, వ్యాపార దిగ్గజాల నుంచి తనకు బెదింపులు వచ్చినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావల్లా సంచలన ఆరోపణలు చేశారు. ఇక... కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను వెంటనే తమకు అందించాలని కూడా డిమాండ్ చేశారని వెల్లడించారు.  ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన ‘ది టైమ్స్‌’కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ వివరాలను వెల్లడించారు.  ‘మాకు వ్యాక్సిన్‌ పంపకుంటే బాగుండదు. తీవ్ర పరిణామాలుంటాయి’ అని హెచ్చరించినట్లు రవెల్లడించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పూనావల్లా ఈ వివరాలను వెల్లడించారు. 


తమను  దిగ్బంధించి, కార్యకలాపాలు సాగించకుండా నిలువరించే దురుద్దేశం వాళ్ల బెదిరింపుల్లో కనిపిస్తోందని పూనావాలా చెప్పారు. ‘భారత్‌లో ఆ దుస్థితిని నేరుగా ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతోనే నేను ఎక్కువ సమయాన్ని లండన్‌లో గడుపుతున్నాను. ఎక్స్‌, వై, జెడ్‌లకు టీకాలను సరఫరా చేయలేకపోతే.. వారు ఏం చేస్తారో ఊహించదలచుకోలేదు’ అని పేర్కొన్నారు. కాగా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లోనూ టీకాల తయారీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పూనావల్లా వెల్లడించారు. మరికొన్ని రోజుల్లోనే దీనిపై కీలక ప్రకటన చేస్తానని పూనావల్లా తెలిపారు.


కొందరు ప్రముఖుల నుంచి బెదిరింపులొచ్చిన నేపధ్యంలో భారత ప్రభుత్వం తనకు ‘వై’ కేటగరీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ, ఆ బెదిరింపులు మాత్రం ఆగలేదని పూనావల్లా చెప్పారు. ఈ క్రమంలోనే... భార్యాబిడ్డలతో కలిసి లండన్ కు వెళ్ళినట్లు ఈ యువపారిశ్రామికవేత్త పూనావల్లా(40) వెల్లడించారు.  ‘నాకొచ్చిన బెదిరింపు కాల్స్ వెనుక భారత్ లోని అత్యంత శక్తివంతులైన వ్యక్తులున్నారు. వారిలో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మరికొందరు వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా కొందరు వ్యక్తులు వచ్చి వ్యాక్సిన్ విషయంలో తనను బలవంతం చేశారని పూనావల్లా చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ ను తక్షణమే తమకు అందించాలన్నది ఆ బెదిరింపుల సారాంశమని పూనావల్లా పేర్కొన్నారు.


మళ్థీ ఆ పరిస్థితిలోకి వెళ్ళవద్దనుకున్నందునే తాను లండన్ లోనే గడుపుతున్నట్లు చెప్పారు. ‘వ్యాక్సిన్ అందజేత భారం నా భుజాలపైనే పడింది. కానీ నేనొక్కడినే ఆ పని చేయలేను’ అని పూనావల్లా స్పష్టం చేశారు. వాళ్ళ అంచనాలు అసాధారణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను మళ్ళీ ఆ పరిస్థితిని ఎదుర్కొదలచుకోలేదని, ఈ క్రమంలోనే తాను లండన్ లోనే ఉంటున్నానని పూనావల్లా వెల్లడించారు. కేవలం ఎక్స్, వై, జెడ్ ల కోసం వ్యాక్సిన్ ను అందించలేము కదా అని వ్యాఖ్యానించారు. ఇక తాను లండన్ లోనే వ్యాక్సిన్ తయారీ సహా వ్యాపారాన్ని ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నట్లు పూనావల్లా చెప్పారు. 

Updated Date - 2021-05-02T23:49:54+05:30 IST