సుప్రింకోర్టు కొలీజియం.. మరో చారిత్రాత్మక నిర్ణయం

ABN , First Publish Date - 2021-09-04T04:29:55+05:30 IST

ఢిల్లీ: సుప్రింకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది జడ్జిల పేర్లను సిపారసు చేసింది. బార్‌ నుంచి 44 మంది, జ్యుడిషియల్‌ సర్వీస్‌ నుంచి 24 మందిని సిఫారసు చేసింది.

సుప్రింకోర్టు కొలీజియం.. మరో చారిత్రాత్మక నిర్ణయం

 ఢిల్లీ: సుప్రింకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 12 హైకోర్టులకు 68 మంది జడ్జిల పేర్లను సిపారసు చేసింది. బార్‌ నుంచి 44 మంది, జ్యుడిషియల్‌ సర్వీస్‌ నుంచి 24 మందిని సిఫారసు చేసింది. తొలిసారి గౌహతి హైకోర్టు జడ్జిగా ఆదివాసీ మహిళా జ్యుడీషియల్‌ ఆఫీసర్‌.. మార్లీ వన్‌ కుంగ్‌ను నియమిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. మార్లీ వన్‌ కుంగ్‌.. మిజోరం నుంచి ఎన్నికైన తొలి మహిళా హైకోర్టు జడ్జి కావడం విశేషం. కొలీజీయం సిఫారసు చేసిన 68 మందిలో 10 మంది మహిళలు ఉన్నారు.

Updated Date - 2021-09-04T04:29:55+05:30 IST