చెరువును మై హోం ఆక్రమించలేదు: నివేదిక

ABN , First Publish Date - 2021-08-20T08:13:38+05:30 IST

మై హోం సంస్థ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం లేదని జాతీయ హరిత ధర్మాసనానికి(ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక అందించింది.

చెరువును మై హోం ఆక్రమించలేదు: నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మై హోం సంస్థ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం లేదని జాతీయ హరిత ధర్మాసనానికి(ఎన్జీటీ)కి సంయుక్త కమిటీ నివేదిక అందించింది. చెరువును ఆక్రమించి మైహోం సంస్థ నార్సింగిలో నిర్మాణం చేపట్టిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో గతంలో తనిఖీల కోసం ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. తాజాగా ఆ కమిటీ తన నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. పుప్పాలగూడ గ్రామ రెవెన్యూ మ్యాప్‌ ప్రకారం నార్సింగి చెరువు, ముష్కిన్‌ చెరువుల్లో ఆక్రమణలు లేవని తెలిపింది. డీఎల్‌ఎఫ్‌ హోమ్స్‌ సంస్థ భూయాజమాని అని, నిర్మాణాల కోసం ఆ సంస్థ పర్యావరణ అనుమతులు తీసుకుందని, ఆ తర్వాత మైహోం సంస్థతో జాయింట్‌ డెవల్‌పమెంట్‌ ఒప్పందం కుదుర్చుకుందని కమిటీ వివరించింది. భూ యజమాని మారలేదు కాబట్టి పర్యావరణ అనుమతుల్లో సవరణ అవసరం లేదని స్పష్టం చేసింది.  

Updated Date - 2021-08-20T08:13:38+05:30 IST