కరోనా తర్వాత రాబోయే ముప్పు బయో టెర్రరిజమే : బిల్‌గేట్స్‌

ABN , First Publish Date - 2021-02-06T07:46:42+05:30 IST

‘‘రానున్న రోజుల్లో దాదాపు కోటి మందిని ఒక విపత్తు కబళించబోతోంది. అందుకు ప్రాణాంతక వైరసే కారణమయ్యేందుకు ఎక్కువ

కరోనా తర్వాత రాబోయే ముప్పు బయో టెర్రరిజమే : బిల్‌గేట్స్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 5: ‘‘రానున్న రోజుల్లో దాదాపు కోటి మందిని ఒక విపత్తు కబళించబోతోంది. అందుకు  ప్రాణాంతక వైరసే కారణమయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.’’ అని ఆరేళ్ల క్రితమే మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు. క

రోనా జడలు విప్పిన తర్వాత ఆనాడు గేట్స్‌ రాసిన నోట్స్‌పై అందరి దృష్టి పడింది. తాజాగా డెరెక్‌ ముల్లర్‌ అనే ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌ నిర్వాహకుడికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ భవిష్యత్తులో మానవాళి ఎదుర్కోబోయే రెండు పెను విపత్తుల గురించి బిల్‌గేట్స్‌ చెప్పారు.


‘వాతావరణ మార్పుల’ను.. కరోనా తర్వాత రాబోయే తొలి విపత్తుగా  అభివర్ణించారు. ప్రస్తుతం కరోనాతో చనిపోతున్న వారి సంఖ్యకు మించిన స్థాయిలో భారీ మరణాలకు అది కారణభూతం అవుతుందని తెలిపారు. ‘బయో టెర్రరిజం’ను రెండో పెనుముప్పుగా గేట్స్‌ పేర్కొన్నారు. సమాజానికి హాని తలపెట్టాలని భావించే దుష్టశక్తులు వైర్‌సలను సృష్టించి ప్రపంచంపైకి వదిలే అవకాశాలు ఉంటాయన్నారు. 


Updated Date - 2021-02-06T07:46:42+05:30 IST