మరాఠా కోటా రాజ్యాంగబద్ధమే

ABN , First Publish Date - 2021-03-24T09:22:50+05:30 IST

మరాఠా కోటా రాజ్యాంగబద్ధమే

మరాఠా కోటా రాజ్యాంగబద్ధమే

సుప్రీంలో కేంద్రం వాదన

న్యూఢిల్లీ/బెంగళూరు, మార్చి 23: విద్య, ఉద్యోగావకాశాల్లో మరాఠాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమేనని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీకి ఆ అధికారం ఉంది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వర్గాల (ఎసీఈబీసీ) వారి జాబితాలను రూపొందించుకోడానికి కేంద్రం చేసిన 102వ రాజ్యాంగ సవరణ అడ్డుపడదు. ఈ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఈబీసీ చట్టం రాజ్యాంగబద్ధం. సదరు ఎస్‌ఈబీసీలను ధ్రువీకరించే పాత్రను మాత్రమే కేంద్రానికి ఉందన్నది ఆర్టికల్‌ 342ఏ విశదీకరిస్తుంది’’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. 


కర్ణాటకలోనూ 50 శాతానికి మించి..

మహారాష్ట్ర ప్రభుత్వ తరహాలోనే కర్ణాటక కూడా మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పైగా పెంచే సన్నాహాల్లో ఉంది. ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో రిజర్వేషన్లను 50 శాతానికి పైగా పెంచేందుకు అనుమతికోసం సుప్రీంకోర్టుకు లేఖ రాయాలని నిర్ణయించారు. కర్ణాటకలో పలు కులాల రిజర్వేషన్‌ పోరాటాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రభుత్వం, కోర్టు అనుమతిస్తే రిజర్వేషన్‌లను మరో 6 నుంచి 8ు పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-03-24T09:22:50+05:30 IST