బారాముల్లాలో ఎదురుకాల్పులు..Terrorist హతం

ABN , First Publish Date - 2021-10-28T14:27:20+05:30 IST

జమ్మూకశ్మీరులో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు...

బారాముల్లాలో ఎదురుకాల్పులు..Terrorist హతం

బారాముల్లా: జమ్మూకశ్మీరులో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, కేంద్ర భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. బారాముల్లాలోని చెర్దారీలో గురువారం ఉదయం పోలీసులతో కలిసి సైనిక బలగాలు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడని కశ్మీర్ పోలీసు ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఎన్‌కౌంటర్ అయిన ఉగ్రవాది జావేద్ అహ్ వానీగా గుర్తించామని, ఇతను కుల్గామ్ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు చెప్పారు. 


మరణించిన ఉగ్రవాది నుంచి ఒక పిస్టల్, లోడెడ్ మ్యాగజైన్, పాక్ గ్రెనెడ్ ను స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.గతంలో వలసకూలీల హత్యల్లో ఈ ఉగ్రవాది జావేద్ పాల్గొన్నాడని పోలీసులు చెప్పారు. బారాముల్లాలో ఒక దుకాణదారుడిని లక్ష్యంగా చేసుకొని దాడిచేసే పనిలో ఉండగా ఎన్‌కౌంటరులో హతం అయ్యాడు.


Updated Date - 2021-10-28T14:27:20+05:30 IST