జమ్మూకశ్మీరులో ఉగ్రవాద సహచరుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-21T15:02:50+05:30 IST

జమ్మూకశ్మీరు పోలీసులు దాడి చేసి ఓ ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు....

జమ్మూకశ్మీరులో ఉగ్రవాద సహచరుడి అరెస్ట్

ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం 

శ్రీనగర్ : జమ్మూకశ్మీరు పోలీసులు దాడి చేసి ఓ ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేసి, ఆయన వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీరు పోలీసులు రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లతో కలిసి కుప్వారా ప్రాంతంలో దాడి చేసిన ఉగ్రవాదుల  సహచరుడైన అబ్  రాషాద్ లోనిని అరెస్టు చేశారు. ఉగ్రవాద సహచరుడి నుంచి మూడు గ్రెనెడ్లు, ఏకే-47 తుపాకీ, 58 రౌండ్ల తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుప్వారాలోని సోగం ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న అబ్ రాషాద్ లోనిని తనిఖీ చేయగా అతని వద్ద ఆయుధాలు లభించాయి.దీంతో ఉగ్రవాద సహచరుడిని అరెస్టు చేసి ఉగ్రవాదుల గురించి ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2021-05-21T15:02:50+05:30 IST