తొందర్లోనే తేజస్వీ యాదవ్ పెళ్లి: క్లారిటీ ఇచ్చిన సోదరి

ABN , First Publish Date - 2021-12-08T22:03:31+05:30 IST

నిశ్చితార్థం సందర్భంగా తేజస్వీ కుటుంబం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, సోదరుడు తేజ్ ప్రతాప్‌తో తేజస్వీ ఢిల్లీలోనే ఉన్నారని, ఈ నిశ్చితార్థ కార్యక్రమం అతి కొద్ది మంది సమక్షంలో జరగనున్నట్లు సమాచారం..

తొందర్లోనే తేజస్వీ యాదవ్ పెళ్లి: క్లారిటీ ఇచ్చిన సోదరి

పాట్నా: బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ గురువారమే తేజస్వీ నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తేజస్వీ సోదరి రోహిణీ ఆచార్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఢిల్లీలో జరగనుందని అంటున్నారు. తేజస్వీ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తేజస్వీ కుటుంబం మాత్రం అధికారికంగా వాటిని ఇంకా నిర్ధారించలేదు.


నిశ్చితార్థం సందర్భంగా తేజస్వీ కుటుంబం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, సోదరుడు తేజ్ ప్రతాప్‌తో తేజస్వీ ఢిల్లీలోనే ఉన్నారని, ఈ నిశ్చితార్థ కార్యక్రమం అతి కొద్ది మంది సమక్షంలో జరగనున్నట్లు సమాచారం. తేజస్వీకి ఇద్దరు సోదరుడు, ఏడుగురు సోదరిణులు. అయితే వీరందరిలో లాలూ రాజకీయ వారసత్వం తేజస్వీకి మాత్రమే వచ్చింది.

Updated Date - 2021-12-08T22:03:31+05:30 IST