త్వరలో Teacher పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2021-12-17T14:09:16+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌ వచ్చే వారంలో జరుగనుందని, అనంతరం ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ప్రకటించారు. తిరువారూర్‌లో గురువారం

త్వరలో Teacher పోస్టుల భర్తీ

                       - మంత్రి అన్బిల్‌ మహేష్‌ వెల్లడి


పెరంబూర్‌(చెన్నై): ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్‌ వచ్చే వారంలో జరుగనుందని, అనంతరం ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ ప్రకటించారు. తిరువారూర్‌లో గురువారం మంత్రి మీడియాతో మాట్లా డుతూ... నీట్‌ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపు పొందే విషయమై న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. అలాగే, ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధానితో ఈ విషయమై చర్చించారని, మరోవైపు శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు అడ్డుకొనేలా పలు చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టె, 14417 అనే నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని కోరామన్నారు. టెన్త్‌, ప్లస్‌ టూ విద్యార్థులకు జనవరి, మార్చి నెలల్లో ప్రీ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తామని, ఈ ఏడాది తప్పనిసరిగా నేరుగా పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 6 నుంచి ప్లస్‌ టూ వరకు వచ్చే 3వ తేదీ నుంచి రోజువారీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించామన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసు నమోదైనుందున, వచ్చే నెల 25వ తేదీ జరిగే సమావేశంలో దినసరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-12-17T14:09:16+05:30 IST