తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు

ABN , First Publish Date - 2021-12-28T16:35:02+05:30 IST

కేరళ రాష్ట్రంలో ఒమైక్రాన్‌, స్వైన్‌ ఫ్లూ ప్రబ లుతున్నాయి. దీంతో తమిళనాడు- కేరళ సరిహద్దు ప్రాంతమైన తెన్‌కాశి జిల్లా పులియరై చెక్‌పోస్ట్‌ వద్ద అన్ని శాఖలు సంయుక్తంగా

తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు

చెన్నై/పెరంబూర్: కేరళ రాష్ట్రంలో ఒమైక్రాన్‌, స్వైన్‌ ఫ్లూ ప్రబ లుతున్నాయి. దీంతో తమిళనాడు- కేరళ సరిహద్దు ప్రాంతమైన తెన్‌కాశి జిల్లా పులియరై చెక్‌పోస్ట్‌ వద్ద అన్ని శాఖలు సంయుక్తంగా ముందుస్తు చర్యలు చేపట్టి, వాహనాలకు క్రిమి నాశిని మందులు పిచికారీ అనంత రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. పులియరై చెక్‌పోస్ట్‌ వద్ద ఆరోగ్య, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. కరోనా రెండు డోసుల టీకా సర్టిఫికెట్‌, 75 గంటల ముందుగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షా ఫలితాలు సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. కరోనా సర్టిఫికెట్‌ లేని వారికి చెక్‌పోస్ట్‌ వద్దే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి పూర్తి వివరాలు సేకరించి 15 రోజులు క్వారంటైన్‌లో వుండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Updated Date - 2021-12-28T16:35:02+05:30 IST