రైల్లో యూనిఫాంలో ఆ Students.... దెబ్బకు స్కూల్లో స్పెషల్ క్లాస్

ABN , First Publish Date - 2021-11-26T23:47:59+05:30 IST

తమిళనాడు రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు చేసిన రైలు స్టంట్ వైరల్ అవుతోంది. దీంతో రైల్వే అధికారులు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన డ్రైవ్ నిర్వహించారు.

రైల్లో యూనిఫాంలో ఆ Students.... దెబ్బకు స్కూల్లో స్పెషల్ క్లాస్

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు చేసిన రైలు స్టంట్ వైరల్ అవుతోంది. దీంతో రైల్వే అధికారులు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన డ్రైవ్ నిర్వహించారు. చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి కావేరిపేటలో హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులకు కదులుతున్న రైలులో విన్యాసాలు చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అవగాహన కల్పించారు. యూనిఫాంలో ఉన్న ఇద్దరు విద్యార్థులు ఇలాంటి పనులు చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చెన్నై శివారులోని కావేరిపేట రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడు తీసిన వీడియోలో ఒక అమ్మాయి కదులుతున్న రైలులో ఎక్కుతుండగా విద్యార్థి దానిని అనుసరిస్తూ కనిపించాడు. విద్యార్థిని కంపార్ట్‌మెంట్ డోరు పట్టుకుని ప్లాట్‌ఫారమ్‌పైకి ఒక కాలు బయట పెట్టడం కనిపిస్తుంది.


ఈ ఘటనపై స్పందించిన తిరువళ్లూరు ఎస్పీ వరుణ్‌కుమార్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తన కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రాణాలను పణంగా పెట్టే ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని ఎస్పీ సూచించారు.Updated Date - 2021-11-26T23:47:59+05:30 IST