అఫ్ఘాన్ పౌరులను అడ్డుకుంటున్న తాలిబన్లు!

ABN , First Publish Date - 2021-08-25T17:24:01+05:30 IST

అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోకి చొరబడిన తాలిబన్లు...

అఫ్ఘాన్ పౌరులను అడ్డుకుంటున్న తాలిబన్లు!

కాబుల్: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోకి చొరబడిన తాలిబన్లు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపధ్యంలో అప్ఘనిస్తాన్ వాసులంతా కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. అక్కడి ఏదో ఒక విమానం పట్టుకుని, ఆ దేశం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబన్లు అప్ఘాన్‌వాసులను కాబుల్ ఎయిర్ పోర్టునకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.


తాలిబన్ ప్రతినిధి జబీరుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎయిర్ పోర్టునకు వెళ్లే దారులను మూసివేస్తున్నామని, ఇకపై అఫ్ఘాన్‌వాసులు దేశం విడిచి వెళ్లలేరన్నారు. కేవలం విదేశీయులను మాత్రమే ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు అనుమతినిస్తున్నామన్నారు. అఫ్ఘాన్‌వాసులంతా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, తాలిబన్ల నుంచి వారికి ఎటువంటి హాని వాటిల్లదన్నారు.


Updated Date - 2021-08-25T17:24:01+05:30 IST