ఆఫ్ఘన్ బడ్జెట్ సిద్ధం చేసిన తాలిబన్లు

ABN , First Publish Date - 2021-12-19T18:08:55+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ జాతీయ ముసాయిదా బడ్జెట్‌ను తాలిబన్ల

ఆఫ్ఘన్ బడ్జెట్ సిద్ధం చేసిన తాలిబన్లు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ జాతీయ ముసాయిదా బడ్జెట్‌ను తాలిబన్ల ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేసింది. విదేశీ నిధులు లేకుండానే దీనిని రూపొందించింది. కేబినెట్ అనుమతించిన తర్వాత దీనిని ప్రచురిస్తారు. ఆగస్టులో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి విదేశీ సహాయం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ నిధులను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేశాయి. 


ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2022 డిసెంబరు వరకు అమలయ్యే ముసాయిదా బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీనిని ప్రచురించడానికి ముందు కేబినెట్ అనుమతి కోసం పంపిస్తామన్నారు. దేశీయ నిధులతోనే కార్యకలాపాలు జరుపుతామన్నారు. ప్రభుత్వం కొన్ని నెలల నుంచి  ప్రభుత్వోద్యోగుల జీతాలు బాకీ పడినట్లు అంగీకరించారు. సంవత్సరాంతానికి ఈ బాకీలు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కొత్త పే స్కేలు సిద్ధమైందని హెచ్చరించారు. 


తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ పతనమైంది. అంతకుముందు ఒక డాలర్‌కు దాదాపు 80 ఆఫ్ఘనీలు వచ్చేవి. తాజాగా ఒక డాలర్‌కు 100 ఆఫ్ఘనీలు వస్తున్నాయి. 


Updated Date - 2021-12-19T18:08:55+05:30 IST