చైనా రాష్ట్రంగా చూపించడంతో యూఎన్‌పై తైవాన్ అసంతృప్తి!

ABN , First Publish Date - 2021-03-22T07:19:21+05:30 IST

ఐక్యరాజ్య సమితి చేసిన ఓ పనిపై తైవాన్ దేశం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమది స్వతంత్ర దేశమని తైవాన్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. చాలా దేశాలు దీన్ని అధికారికంగా గుర్తించాయి కూడా. అయితే యూఎన్(ఐక్యారాజ్య సమితి) మాత్రం ఈ దేశాన్ని చైనాలో ఒక రాష్ట్రంగా పేర్కొంది.

చైనా రాష్ట్రంగా చూపించడంతో యూఎన్‌పై తైవాన్ అసంతృప్తి!

తైపీ: ఐక్యరాజ్య సమితి చేసిన ఓ పనిపై తైవాన్ దేశం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమది స్వతంత్ర దేశమని తైవాన్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. చాలా దేశాలు దీన్ని అధికారికంగా గుర్తించాయి కూడా. అయితే యూఎన్(ఐక్యారాజ్య సమితి) మాత్రం ఈ దేశాన్ని చైనాలో ఒక రాష్ట్రంగా పేర్కొంది. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. యూఎన్ ఇటీవల విడుదల చేసిన ఒక రిపోర్టులో చైనాలోని ప్రావిన్సుల జాబితాలో తైవాన్ పేరు కూడా ఉంది. దీన్ని తప్పుబట్టిన తైవాన్ ప్రభుత్వం.. ‘‘ఇలా తైవాన్‌ను చైనాలో చూపించడం తప్పు, అంగీకార యోగ్యం కాదు. ఇది స్వేచ్ఛాయుత, శక్తిమంతమైన మా దేశ ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా కించపరచడమే’’ అని న్యూయార్క్‌లోని తైవాన్ ప్రతినిధి కార్యాలయం విమర్శించింది. అయితే చాలా దేశాలు వన్-చైనా పాలసీ కింద తైవాన్‌తో దౌత్యసంబంధాలను ఏర్పాటు చేసుకోలేదు.

Updated Date - 2021-03-22T07:19:21+05:30 IST