స్వీడన్ తొలి మహిళా ప్రధాని రాజీనామా
ABN , First Publish Date - 2021-11-26T09:05:54+05:30 IST
స్వీడన్ దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలినా ఆండర్సన్ బుధవారం పార్లమెంట్లో ఎన్నికైన కొద్ది గంటలకే రాజీనామా చేశారు.
కోపెన్‌హాగెన్, నవంబరు 25: స్వీడన్ దేశ తొలి మహిళా ప్రధాన మంత్రిగా మగ్దలినా ఆండర్సన్ బుధవారం పార్లమెంట్లో ఎన్నికైన కొద్ది గంటలకే రాజీనామా చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు గ్రీన్ పార్టీ ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజీనామా చేసిన అనంతరం మగ్దలినా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఇది గౌరవానికి సంబంధించిన విషయం. ఉనికి ప్రశ్నార్థకంగా మారిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను నడిపించాలని అనుకోవడంలేదు’’ అని స్పష్టం చేశారు.