Jai Bhim: సినీనటుడు సూర్యకు బెదిరింపులు..ఇంటికి సాయుధ పోలీసుల రక్షణ

ABN , First Publish Date - 2021-11-17T12:56:18+05:30 IST

తాజాగా సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం మరో వివాదానికి దారి తీసింది....

Jai Bhim: సినీనటుడు సూర్యకు బెదిరింపులు..ఇంటికి సాయుధ పోలీసుల రక్షణ

చెన్నై(తమిళనాడు): తాజాగా సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం మరో వివాదానికి దారి తీసింది. వన్నియార్ సంఘం ప్రతిష్ఠను దిగజార్చినందుకు చిత్ర నిర్మాతలైన సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం నవంబరు 15న లీగల్ నోటీసు పంపింది. దీని తర్వాత జై భీమ్ సినిమా వివాదంపై నటుడు సూర్యకు పలు బెదిరింపులు రావడంతో అతని నివాసం వద్ద సాయుధ పోలీసులను ఉంచారు. ప్రస్తుతం టీ నగర్‌లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను మోహరించారు.జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు వన్నియార్ సంఘం ప్రతిష్ఠను దిగజార్చాయని నోటీసులో పేర్కొన్నారు.


వన్నియార్ సంఘానికి సూర్య బృందం బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా, నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నోటీసు తర్వాత వన్నియార్ సంఘం సభ్యులు సూర్యకు బహిరంగంగా బెదిరించారు. సినీనటుడు సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకే) నాగపట్నం జిల్లా కార్యదర్శి సీతమల్లి పజాని సామి ప్రకటించారు.జై భీం చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ అయిన 2డి ప్రొడక్షన్స్ నిర్మించింది.


 ఇరులార్ కమ్యూనిటీ సభ్యులకు కస్టోడియల్ టార్చర్ గురించి ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రంలో సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.


Updated Date - 2021-11-17T12:56:18+05:30 IST