హాస్యనటుడు మునవర్‌కు సుప్రీం తాత్కాలిక బెయిల్

ABN , First Publish Date - 2021-02-05T18:09:41+05:30 IST

హాస్యనటుడు మునవర్ ఫారుఖీకి సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది....

హాస్యనటుడు మునవర్‌కు సుప్రీం తాత్కాలిక బెయిల్

న్యూఢిల్లీ : హాస్యనటుడు మునవర్ ఫారుఖీకి సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.మతపరమైన భావాలను అవమానించారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు మునవర్ ఫారుఖీపై కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ప్రదర్శనలో హిందూదేవుళ్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఫారుఖీని జనవరి 1వతేదీన పోలీసులు అరెస్టు చేశారు. హింద్ రక్షక్ సంఘటన్ అనే హిందూత్వ సంస్థ చీఫ్ ఏకలవ్య గౌర్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ రోహింటన్ పాలి నారిమన్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఫరూకీపై వారెంటును నిలిపివేసింది. గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టాన్ని కోడ్ ఆఫ్ క్రిమనల్ ప్రొసీజరులో సెక్షన్ 41 ప్రకారం పాటించలేదని సుప్రీం మధ్యప్రదేశ్ సర్కారుకు నోటీసు జారీ చేసింది. గతంలో సెషన్సు కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టులు ఫారుఖీ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించాయి. 

Updated Date - 2021-02-05T18:09:41+05:30 IST