14 భాషల్లో ‘ఈ-కోర్ట్స్ సర్వీసెస్’ యాప్
ABN , First Publish Date - 2021-05-24T09:48:02+05:30 IST
దేశ పౌరుల విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని 14 భాషల్లో ‘‘ఈ-కోర్ట్స్ సర్వీసెస్’’ మొబైల్ యాప్‌ను సుప్రీం కోర్టు ఈ-కమిటీ విడుదల చేసింది. సామాన్యులకు సైతం

న్యూఢిల్లీ, మే 23(ఆంధ్రజ్యోతి): దేశ పౌరుల విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని 14 భాషల్లో ‘‘ఈ-కోర్ట్స్ సర్వీసెస్’’ మొబైల్ యాప్‌ను సుప్రీం కోర్టు ఈ-కమిటీ విడుదల చేసింది. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఈ యాప్‌ను రూపొందించింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, ఖాసీ, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, తమిళ భాషల్లో ఈ యాప్‌ను విడుదల చేసినట్లు కేంద్ర చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ యాప్‌ను ఇప్పటికే 57లక్షలకుపైగా డౌన్‌లోడ్‌లు జరిగాయని సుప్రీం కోర్టు ఈ-కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించినట్లు ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.