పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంలో ఊరట

ABN , First Publish Date - 2021-11-23T08:10:34+05:30 IST

ముంబై పోలీసు మాజీ చీఫ్‌ పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బలవంతపు వసూళ్ల అభియోగాలతో కేసులను ఎదుర్కొంటున్న ఆయ..

పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంలో ఊరట

అరెస్టు నుంచి రక్షణ కల్పించిన కోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 22: ముంబై పోలీసు మాజీ చీఫ్‌ పరంబీర్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బలవంతపు వసూళ్ల అభియోగాలతో కేసులను ఎదుర్కొంటున్న ఆయన.. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా పరంబీర్‌ ఎక్కడున్నాడో చెబితేనే కేసును విచారిస్తామని, విదేశాల్లో ఉండి.. కోర్టు ద్వారా భద్రత లభిస్తేనే తిరిగి వచ్చే ఆలోచనలు ఉంటే ఎలా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోమవారం మరోమారు విచారణ జరగ్గా.. పరంబీర్‌ ఎక్కడికీ పారిపోలేదని, భారత్‌లోనే ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. 

Updated Date - 2021-11-23T08:10:34+05:30 IST