అండమాన్ దీవుల్లో సూపర్‌బగ్
ABN , First Publish Date - 2021-03-19T06:38:45+05:30 IST
అందుబాటులో ఉన్న పలు శక్తిమంతమైన యాంటీ బయాటిక్ మందులకు లొంగని ‘కాండిడా ఆరిస్’ అనే సూపర్‌బగ్‌ను అండమాన్ చుట్టుపక్కల దీవుల్లో కనుగొన్నట్టు ఢిల్లీ వర్సిటీకి చెందిన డాక్టర్ అనూరాధ చౌదరి
న్యూఢిల్లీ, మార్చి 18: అందుబాటులో ఉన్న పలు శక్తిమంతమైన యాంటీ బయాటిక్ మందులకు లొంగని ‘కాండిడా ఆరిస్’ అనే సూపర్‌బగ్‌ను అండమాన్ చుట్టుపక్కల దీవుల్లో కనుగొన్నట్టు ఢిల్లీ వర్సిటీకి చెందిన డాక్టర్ అనూరాధ చౌదరి, ఆమె బృందం తెలిపింది. ఇది కూడా కరోనాలాగానే మరో మహమ్మారిలా దాపురించే ప్రమాదం ఉందన్నారు. ఈ బ్యాక్టీరియా మనుషుల చర్మంపై ఉంటుందని, గాయమైతే దాని ద్వారా శరీరంలోకి, రక్త ప్రసరణ వ్యవస్థలోకి వెళ్లి చలి జ్వరం వస్తుందని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.