అమెజాన్‌ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌

ABN , First Publish Date - 2021-11-26T09:10:44+05:30 IST

ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌ నుంచి విషపూరితమైన సల్ఫస్‌ పౌడర్‌ తెప్పించుకుని, దానిని సేవించి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి

అమెజాన్‌ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌

యువకుడి ఆత్మహత్య కేసులో మధ్యప్రదేశ్‌ హోం మంత్రి


ఇందౌర్‌, నవంబరు 25: ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌ నుంచి విషపూరితమైన సల్ఫస్‌ పౌడర్‌ తెప్పించుకుని, దానిని సేవించి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి కేసులో అమెజాన్‌ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆదేశించారు. మృతుడి తండ్రి గురువారం ఇందౌర్‌లో మంత్రిని కలిశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. యువకుడి ఆత్మహత్య కేసును తాను సుమోటోగా తీసుకున్నానని, అమెజాన్‌ అధికారులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించానని మంత్రి తెలిపారు. కాగా ఇటీవలే అమెజాన్‌ నుంచి ఓ యువకుడు (18) సల్ఫస్‌ పౌడర్‌ తెప్పించుకొని దానిని వినియోగించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి రంజిత్‌ వర్మ మంత్రిని కలిసి, అమెజాన్‌పై కేసు నమోదు చేయాలని కోరారు.

Updated Date - 2021-11-26T09:10:44+05:30 IST