ఇన్ని రోజులు సమావేశాలకు డుమ్మాలు కొట్టి... ఇప్పుడు విమర్శలా? : సుబేందు ఫైర్

ABN , First Publish Date - 2021-05-20T21:31:27+05:30 IST

సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనా స్థితిగతులను తెలుసుకునేందుకు

ఇన్ని రోజులు సమావేశాలకు డుమ్మాలు కొట్టి... ఇప్పుడు విమర్శలా? : సుబేందు ఫైర్

కోల్‌కతా : సీఎం మమతా బెనర్జీపై బీజేపీ ఎమ్మెల్యే సుబేందు అధికారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరోనా స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రధాని మోదీ నిర్వహించే సమావేశాలను రాజకీయం చేయడంలో మమతా బెనర్జీ బిజీ అయిపోయారని మండిపడ్డారు. కరోనాపై ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశాలకు మమతా బెనర్జీ డుమ్మా కొట్టారని, ఇప్పుడేమో విమర్శలు చేస్తున్నారని సుబేందు ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘గౌరనీయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మరోసారి పరిపాలనపై మక్కువను కనబరచలేదు. ఆమె శైలే అంత. కోవిడ్ పై ప్రధాని నిర్వహించిన సమావేశాన్ని కూడా రాజకీయం చేసేశారు. కొన్ని నెలలుగా మోదీ తరుచుగా ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం మమత ఎన్నింటికి హాజరయ్యారు. నిరభ్యంతరంగా చెప్పాలంటే ‘‘సున్నా’’. సమావేశాలకు హాజరే కాలేదు’’ అంటూ సుబేందు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-05-20T21:31:27+05:30 IST