స్టంట్‌ మాస్టర్‌ ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-08-20T14:22:07+05:30 IST

ప్రముఖ సినీ స్టంట్‌ మాస్టర్‌ జూడో రత్తినం నివాసగృహంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి వెంటి ఆభరణాలు, విలువైన పట్టుచీరలు, జ్ఞాపికలను దోచుకెళ్ళారు. గుడియాత్తం

స్టంట్‌ మాస్టర్‌ ఇంట్లో చోరీ

చెన్నై: ప్రముఖ సినీ స్టంట్‌ మాస్టర్‌ జూడో రత్తినం నివాసగృహంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి వెంటి ఆభరణాలు, విలువైన పట్టుచీరలు, జ్ఞాపికలను దోచుకెళ్ళారు. గుడియాత్తం తానంపేట పెరియప్ప వీథిలో జూడో రత్తినం నివసిస్తున్నారు. చెన్నైలో సోమవారం జరిగిన నడిగర్‌ సంఘం వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్ళారు. చెన్నైలోని కుమారుడి ఇంటిలో రెండు రోజులపాటు బసచేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుడియాత్తంలోని జూడో రత్తినం ఇంటి తలుపులు తెరచి ఉండటం చూసిన ఎదురింటి వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన వెళ్ళి చోరీస్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత జరిపిన విచారణలో బీరువాలో భద్రపరచిన అరకేజీ వెండి ఆభరణాలు, పట్టుచీరలు, ట్రోఫీలు, రెండు రోలెక్స్‌ వాచీలు, రూ.20 వేల నగదును దొంగలు దోచుకెళ్ళినట్లు కనుగొన్నారు.

Updated Date - 2021-08-20T14:22:07+05:30 IST