తగ్గిన హజ్ యాత్రికుల సంఖ్య... మహిళలు ముగ్గురే!

ABN , First Publish Date - 2021-01-12T13:07:36+05:30 IST

ఈసారి యూపీ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాత్రికులలో...

తగ్గిన హజ్ యాత్రికుల సంఖ్య... మహిళలు ముగ్గురే!

లక్నో: ఈసారి యూపీ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. యాత్రికులలో మహిళలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. హజ్ వెళ్లాలనుకుంటున్న యాత్రికుల నుంచి ఈనెల 10 వరకూ కేవలం 6,235 దరఖాస్తులు మాత్రమే అందాయి. గత ఐదేళ్లలో ఈ సంఖ్య 14 వేలకు తక్కువగా ఎప్పుడూ నమోదుకాలేదు. ఈసారి కరోనా ముప్పు పొంచివుండటం, దీనికితోడు యాత్రకు ప్రయాణపు ఖర్చు పెరిగిపోవడంతో హజ్ యాత్రికుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. 


హజ్ యాత్రకు సంబంధించి కాన్పూర్ నుంచి 218 దరఖాస్తులు రాగా, వాటిలో ఒక్క మహిళ కూడా లేకపోవడం విశేషం. ఈ సందర్భంగా తంజీమ్ హజ్ ఖుద్దమ్ కమిటీ సభ్యుడు హాజీ నయీముద్దీన్ మాట్లాడుతూ హజ్ యాత్ర 20వ శతాబ్ధంలో ఎప్పుడూ ఆగలేదని రెండవ ప్రపంచయుద్ధం, ప్లేగు మహమ్మారి తాండివిస్తున్న సమయంలో హజ్ యాత్ర కొంతవరకూ ఆగిందన్నారు. అయితే యాత్రికుల సంఖ్య కాస్త తక్కువగా ఉండేదన్నారు. 21వ శతాబ్ధంలోని 2020లో కరోనా కారణంగా భారత్ నుంచి హజ్ యాత్రకు ఎవరూ వెళ్లలేదన్నారు. దీనికిముందు 1898, 1899లలో ప్లేగు వ్యాధి కారణంగా భారత్‌కు చెందిన ముస్లింలెవరూ హజ్ యాత్ర చేయలేదన్నారు. 1920, 1940 లలో ప్లేగు వ్యాధి కారణంగా ఇక్కడి నుంచి హజ్ యాత్ర ఎవరూ చేయలేదన్నారు. అయితే ఈసారి కోవిడ్ కారణంగా కేంద్ర హజ్ కమిటీ కొన్ని నిబంధనలను విధించిందని, ఈ కారణంగా పలువురు యాత్ర విరమించుకున్నారని తెలిపారు.

Updated Date - 2021-01-12T13:07:36+05:30 IST