ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: గవర్నర్‌తో స్టాలిన్

ABN , First Publish Date - 2021-05-05T21:52:34+05:30 IST

మే 7న ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కోవిడ్ కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎటువంటి హంగుఆర్భాటాలు లేకుండా సాధారణంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: గవర్నర్‌తో స్టాలిన్

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే అధినేత స్టాలిన్ (68) ముందుకు వచ్చారు. ఈ విషయమై బుధవారం రాజ్‌భవన్ వెళ్లి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలుసుకున్నారు. అనంతరం తనకు మద్దతుగా 133 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసి ఇచ్చిన లేఖను గవర్నర్‌కు అందించారు. స్టాలిన్‌ను డీఎంకే పక్ష నేతగా మంగళవారం ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘‘డీఎంకే పక్ష నేతగా పార్టీ అధినేత స్టాలిన్‌ ఎన్నికయ్యారు’’ అని రాసుకొచ్చారు.


మే 7న ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కోవిడ్ కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎటువంటి హంగుఆర్భాటాలు లేకుండా సాధారణంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడం ఇది ఆరవసారి. గత ఐదుసార్లు దివంగత నేత కరుణానిధి నేతృత్వంలో అధికారంలోకి రాగా, ఈసారి ఆయన కుమారుడు స్టాలిన్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 159 స్థానాలు గెలుచుకుంది. ఇక రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే పార్టీ 66 స్థానాలు గెలుచుకుంది. ఇక అన్నాడీఎంకే మిత్రపక్షాలైన బీజేపీ ఐదు స్థానాలు, పీఎంకే నాలుగు స్థానాలు గెలుచుకుంది.

Updated Date - 2021-05-05T21:52:34+05:30 IST