సోనియా పుట్టినరోజు చేసుకోకపోవడంపై స్టాలిన్ ప్రశంసలు

ABN , First Publish Date - 2021-12-09T21:47:08+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధినే సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఆనందంగా ఆమె ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం నేపథ్యంలో ఆమె తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. ఆమె తన పరిపక్వతను..

సోనియా పుట్టినరోజు చేసుకోకపోవడంపై స్టాలిన్ ప్రశంసలు

చెన్నై: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణం నేపథ్యంలో ఈ యేడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ప్రకటించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. దేశం పట్ల ఆమెకు ఉన్న అంకితభావం, వ్యక్తిగతంగా ఆమె పరిపక్వత ఉన్నతమైనవని అందుకే తాను సోనియా గాంధీని గౌరవిస్తానని ఆయన అన్నారు. గురువారం ట్విట్టర్ ద్వారా సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే తాజా నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపించారు.


‘‘కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఆనందంగా ఆమె ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం నేపథ్యంలో ఆమె తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. ఆమె తన పరిపక్వతను, దేశం పట్ల అంకితభావాన్ని చూపించుకున్నారు. అందుకే ఆమె అంటే నాకు అంతటి గౌరవం’’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. కాగా, దీనికి కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ‘‘ధన్యవాదాలు స్టాలిన్. సోనియా గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కాని దేశమే ప్రథమ ప్రాధాన్యత. అది ఈరోజైనా, ఏరోజైనా’’ అని పేర్కొంది.

Updated Date - 2021-12-09T21:47:08+05:30 IST