కరోనాతో మరణించిన వైద్యుల కుటుంబాలకు 25 లక్షల సాయం

ABN , First Publish Date - 2021-05-13T08:42:53+05:30 IST

కరోనా బాధితులకు చికిత్సలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన 43మంది వైద్యుల కుటుంబాలకు రూ.25 లక్ష ల చొప్పున ఆర్థికసాయాన్ని తమిళనాడు ప్రభు త్వం అందించనుంది.

కరోనాతో మరణించిన వైద్యుల కుటుంబాలకు 25 లక్షల సాయం

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటన


చెన్నై, మే 12(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు చికిత్సలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన 43మంది వైద్యుల కుటుంబాలకు రూ.25 లక్ష ల చొప్పున ఆర్థికసాయాన్ని తమిళనాడు ప్రభు త్వం అందించనుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటంలో ఏడాదికిపైగా ప్రభుత్వ వైద్యులు, నర్సులు, సహాయకులు పాటుపడుతున్నారని ఆయన ప్రశంసించారు.


తాము వైరస్‌ తాకిడికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిసినా ప్రాణాలకు తెగించి వారందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అలా గతేడాది నుంచి ఇప్పటిదాకా 43మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే,  కరోనా రెండో దశలోనూ సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 

Updated Date - 2021-05-13T08:42:53+05:30 IST