ఎస్‌ఎస్ఎల్‌సీలో అందరూ ఉత్తీర్ణులే..

ABN , First Publish Date - 2021-08-10T17:00:27+05:30 IST

రాష్ట్రంలో ఎస్‌ఎస్ఎల్‌సీలో పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ సోమవారం ఫలితాలను ప్రకటించారు. 99.99 శాతం ఉత్తీర్ణత సాధ్యమైం

ఎస్‌ఎస్ఎల్‌సీలో అందరూ ఉత్తీర్ణులే..

- 157 మందికి అన్నింటా వంద మార్కులే 

- బెంగళూరు ఉత్తర ప్రథమ స్థానం.. బళ్లారి చివరి స్థానం

- ఒక్కరు గైర్హాజరు


బెంగళూరు: రాష్ట్రంలో ఎస్‌ఎస్ఎల్‌సీలో పరీక్షలు రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ సోమవారం ఫలితాలను ప్రకటించారు. 99.99 శాతం ఉత్తీర్ణత సాధ్యమైందని ఆయన వెల్లడించారు. జూలై 19, 22 తేదీలలో రోజుకు 3 సబ్జెక్టులవారీగా పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. 4,70,160 మంది బాలురు, 4,01,280 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఓ విద్యార్థిని గైర్హాజరు కావడంతో ఫెయిల్‌ అయినట్టు ప్రకటించారు. 1,28, 901 మంది ఏ ప్లస్‌, 2,50,317 మంది ఏ గ్రేడ్‌, 2,87,694 మంది బీ గ్రేడ్‌, 1,13,610 మంది సీ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. సీ గ్రేడ్‌ మార్కులు పొందినవారిలో 9శాతం మందికి గ్రేస్‌ మార్కులు వేసి ఉత్తీర్ణులు చేశామన్నారు. 157 మంది అన్ని సబ్జెక్టులలోనూ 625 మార్కులకు 62 5 సాధించారన్నారు. 289 మంది 623 మార్కులు, ఇద్దరు 622 మార్కులు, 449 మంది 621 మార్కులు, 28 మంది 620 మా ర్కులు చొప్పున సాధించారు. ప్రథమ భాషలో 25,702 మంది 125/125 మార్కులు, ద్వితీయ భాషలో 36,628 మంది, తృతీయభాషలో 36,776 మంది 100/100 మార్కులు సాధించారు. గణితంలో 6,321 మంది, సైన్సులో 3,649 మంది, సోషియల్‌లో 9,367 మంది వందశాతం మార్కులు పొందారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చునన్నారు. బెంగళూరు ఉత్తర ప్రథమ స్థానంలోనూ, బళ్లారి చివరిస్థానంలో నిలిచిందన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఫలితాలు ఒకే విధంగా ఉన్నాయి. బెంగళూరు దక్షిణ - ద్వితీయ, రామనగర్‌ జిల్లా - తృతీయ స్థానంలో నిలిచాయి. 58 మంది విద్యార్థులు కొవిడ్‌కేర్‌ సెంటర్‌ల నుంచే పరీక్షలు రాయగా 2870 మంది హాస్టల్‌ నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి 760 మంది పరీక్షలు రాశారు. 

Updated Date - 2021-08-10T17:00:27+05:30 IST