పులుల శరణాలయాలుగా శ్రీవిల్లిపుత్తూర్‌, మేఘమలై

ABN , First Publish Date - 2021-02-08T12:47:45+05:30 IST

శ్రీవిల్లిపుత్తూర్‌, మేఘమలై అటవీ ప్రాంతాలను పులుల శరణాలయాలుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కళక్కాడు ముండతురై

పులుల శరణాలయాలుగా శ్రీవిల్లిపుత్తూర్‌, మేఘమలై

చెన్నై/ఐసిఎఫ్(ఆంధ్రజ్యోతి): శ్రీవిల్లిపుత్తూర్‌, మేఘమలై అటవీ ప్రాంతాలను పులుల శరణాలయాలుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కళక్కాడు ముండతురై, ఆనమలై, ముదుమలై, సత్య మంగళం పులుల శరణాలయాలున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీవిల్లిపుత్తూర్‌, మేఘమలై అటవీ ప్రాంతాలను కూడా పులుల శరణాలయాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మూడు ఆడ పులులతో పాటు 14 పులులు నివసిస్తున్నాయి. వీటి పాదముద్రల ఆధారంగా పులుల శరణాలయాలుగా మార్చాలని కేంద్రప్రభుత్వానికి గత జనవరిలో రాష్ట్రప్రభుత్వం లేఖ రాసింది. 

Updated Date - 2021-02-08T12:47:45+05:30 IST