‘కిటెక్స్‌’కు శ్రీలంక ఆహ్వానం

ABN , First Publish Date - 2021-07-26T08:10:07+05:30 IST

కేరళకు చెందిన కిటెక్స్‌ వస్త్ర పరిశ్రమకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ...

‘కిటెక్స్‌’కు శ్రీలంక ఆహ్వానం

  • తమ దేశంలో పెట్టుబడి పెట్టాలని పిలుపు

కొచ్చి, జూలై 25: కేరళకు చెందిన కిటెక్స్‌ వస్త్ర పరిశ్రమకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి కూడా ఆహ్వానాలు అందుతున్నాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలంటూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇటీవల కిటెక్స్‌ సంస్థను కోరగా.. తాజాగా శ్రీలంక ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్‌ డి.వెంకటేశ్వరన్‌ శనివారం కిటెక్స్‌ కార్యాలయానికి వెళ్లి ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సాబు జాకబ్‌తో చర్చలు జరిపారు. తమ దేశంలో పెట్టుబడులు పెడితే.. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కేరళలో కొత్తగా రూ.3500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడ్డ కిటెక్స్‌.. రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాల కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం, తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో సాబు జాకబ్‌ ఇటీవల ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.  

Updated Date - 2021-07-26T08:10:07+05:30 IST