పుదుచ్చేరిలో స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-05-24T17:19:23+05:30 IST

పుదుచ్చేరిలో ‘స్పుత్నిక్‌, 2డీజీ కొవిడ్‌’ వ్యాక్సిన్ల ఉత్పత్తికి అనుమతించాలని ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

పుదుచ్చేరిలో స్పుత్నిక్‌ టీకా ఉత్పత్తి

కేంద్రానికి గవర్నర్‌ తమిళిసై విజ్ఞప్తి

చెన్నై/ప్యారీస్: పుదుచ్చేరిలో ‘స్పుత్నిక్‌, 2డీజీ కొవిడ్‌’ వ్యాక్సిన్ల ఉత్పత్తికి అనుమతించాలని ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి రాజ్‌నివాస్‌లో ఆదివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌, 2డీజీ మందుల తయారీ సంస్థల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంప్రదించినట్టు తెలిపారు. ఈ రెండిం టినీ పుదుచ్చేరిలో ఉత్పత్తి చేసేలా డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థను కోరామని తెలిపారు. పుదుచ్చేరిలో ఈ రెండు ఉత్పత్తులకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై ముఖ్య మంత్రితో చర్చించనున్నట్టు గవర్నర్‌ తెలిపారు.

Updated Date - 2021-05-24T17:19:23+05:30 IST