స్పుత్నిక్-వి అన్ని వేరియంట్లపైనా పనిచేస్తుంది : ‘గమలేయ’
ABN , First Publish Date - 2021-06-23T10:02:38+05:30 IST
అన్ని కరోనా వేరియంట్ల నుంచీ స్పుత్నిక్-వి టీకా రక్షణ కల్పించగలదని దాన్ని అభివృద్ధి చేసిన రష్యా సంస్థ గమలేయ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు
మాస్కో, జూన్ 22 : అన్ని కరోనా వేరియంట్ల నుంచీ స్పుత్నిక్-వి టీకా రక్షణ కల్పించగలదని దాన్ని అభివృద్ధి చేసిన రష్యా సంస్థ గమలేయ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ను తీసుకునే వారిలో విడుదలయ్యే యాంటీబాడీలకు బ్రిటన్ వేరియంట్ నుంచి డెల్టా వేరియంట్ దాకా ప్రతీదాని నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉందని ఆయన వెల్లడించారు.